ఆ ధరలు పెరిగాయ్... అందుకే ధరలు పెంచాం : మారుతి...

ABN , First Publish Date - 2021-06-22T23:33:48+05:30 IST

మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ ధరలు పెరిగాయ్... అందుకే ధరలు పెంచాం : మారుతి...

న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో అన్ని మోడళ్ళ ధరలనూ పెంచుతామని వెల్లడించింది. తమ కార్ల ధరల పెంపునకు కారణాలను వివరిస్తూ... ‘ఉక్కుతో పాటు వాహన తయారీలో కీలకమైన వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగాయి, అందుకే ధరల పెంపు తప్పడం లేదు’ అని మారుతీ సుజుకీ సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


ఇంతకుముందు ఏప్రిల్ నెలలో మారుతి వాహన ధరలు పెరిగాయి మారుతీ. ఆల్టో నుండి ఎస్ క్రాస్ వరకు వివిధ మోడళ్ళను మారుతీ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్స్-షోరూం ప్రకారం వీటి ధరల శ్రేణి కనిష్ఠంగా రూ. 3 లక్షలు, గరిష్ఠంగా రూ. 12.39 లక్షలుగా ఉన్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపధ్యంలో జూలై-సెప్టెంబరు త్రైమాసికం నుండి మరోసారి ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

Updated Date - 2021-06-22T23:33:48+05:30 IST