టర్మ్‌ పాలసీలు ప్రియం!

ABN , First Publish Date - 2021-03-14T06:21:53+05:30 IST

జీవిత బీమా రంగంలోని కొన్ని కంపెనీలు టర్మ్‌ పాలసీ ప్రీమియంలు పెంచాలని భావిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కెనరా హెస్‌ఎ్‌సబీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ వంటి అయిదారు

టర్మ్‌ పాలసీలు ప్రియం!

15% వరకూ పెరిగే అవకాశం

పెరిగిన రీఇన్సూరెన్స్‌ రేట్లే కారణం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీవిత బీమా రంగంలోని కొన్ని  కంపెనీలు టర్మ్‌ పాలసీ ప్రీమియంలు పెంచాలని భావిస్తున్నాయి. టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కెనరా హెస్‌ఎ్‌సబీసీ ఓబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ వంటి అయిదారు కంపెనీలు ఏప్రిల్‌ నుంచి టర్మ్‌ పాలసీల ప్రీమియంలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియంలు 15 శాతం వరకూపెరగొచ్చని అంచనా వేస్తున్నాయి. దీర్ఘకాలంగా టర్మ్‌ పాలసీల ప్రీమియంలు తక్కువగా ఉండడం.. క్లెయిమ్‌లు పెరగడం, రీఇన్సూరర్లు రేట్లు పెంచడం వంటి కారణాల వల్ల టర్మ్‌ పాలసీల ప్రీమియంలను పెంచే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం టర్మ్‌ పాలసీలకు ఆదరణ పెరిగిందని.. ప్రీమియంల పెంపు ప్రభావం అమ్మకాలపై ఉండబోదని భావిస్తున్నాయి. కాగా గత ఏడాదిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, హెచ్‌డీఎ్‌ఫసీ లైప్‌ ఇన్సూరెన్స్‌ వంటి పెద్ద కంపెనీలు టర్మ్‌ ప్లాన్ల ప్రీమియంలను 20-30 శాతం వరకూ పెంచాయి. 


2010 స్థాయికి..: గత ఏడాది ప్రీమియంల పెంపుతో టర్మ్‌ పాలసీల రేట్లు 2014 స్థాయికి చేరాయని.. తాజాగా పెంచితే.. దేశంలో టర్మ్‌ పాలసీలు ప్రారంభమైన 2010 నాటి స్థాయికి పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టర్మ్‌ పాలసీలు ప్రవేశించిన అనంతరం గత పదేళ్లలో పోటీ, వినూత్న ఉత్పత్తుల కారణంగా ప్రీమియం రేట్లు గణనీయంగా తగ్గాయి. కొవిడ్‌కు ముందు కూడా కంపెనీలు పోటీపడి టర్మ్‌ పాలసీలను తక్కువ ప్రీమియంలకు ఆఫర్‌ చేశాయి. తాజాగా ప్రీమియంలను పెంచినప్పటికీ.. అమెరికా, సింగపూర్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. ప్రీమియం పెరిగినప్పటికీ.. అండర్‌రైటింగ్‌ విధానాలు బాగుండాలి. చెల్లిస్తున్న ధరకు అనుగుణంగా అండర్‌రైటింగ్‌ విధానాలు మారాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-03-14T06:21:53+05:30 IST