రూ.75 కోట్లతో టెక్నో పెయింట్స్ ప్లాంట్
ABN , First Publish Date - 2021-08-25T06:49:51+05:30 IST
: సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీకి హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయిం ట్స్ కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీకి హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయిం ట్స్ కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.75 కోట్లతో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు ఇటలీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫార్చ్యూన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టెక్నో బ్రాండ్‌తో కంపెనీ పెయింట్లను తయారు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని చేర్యాల్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ యూ నిట్ కంపెనీకి ఆరోది అవుతుంది. రెండు దశల్లో 2 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ తో ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.