రిలయన్స్‌‌ను మించే వేగంతో... టీసీఎస్ రికార్డ్...

ABN , First Publish Date - 2021-01-12T20:24:53+05:30 IST

శీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సరికొత్త రికార్డుకు చేరుకుంది. గతంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ రూ. 10 లక్షల కోట్ల దిగువన ఉంది.

రిలయన్స్‌‌ను మించే వేగంతో... టీసీఎస్ రికార్డ్...

ముంబై : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సరికొత్త రికార్డుకు చేరుకుంది. గతంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ రూ. 10 లక్షల కోట్ల దిగువన ఉంది. కాగా... రిలయన్స్ స్టాక్ అంతకంతకూ పడిపోగా, టీసీఎస్ షేర్ ధర పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో... రిలయన్స్‌కు టీసీఎస్  ఇప్పుడు అతి చేరువలో ఉంది. 


టీసీఎస్ షేర్ ధర ఈ రోజు ఓ సమయంలో 3.5 శాతం ఎగబాకి రూ. 3,230 ను తాకింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ. 12 లక్షల కోట్లను దాటింది. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఈ మార్కు దాటిన రెండో కంపెనీ టీసీఎస్ మాత్రమే. కాగా... అక్టోరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి.


జూలై-సెప్టెంబరు త్రైమాసికంలోని రూ. 7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏడు శాతానికి పైగా పెరిగి రూ. 8,727 కోట్లకు చేరుకుంది. అంతకుముందే దూకుడు మీదున్న ఈ స్టాక్... మొన్నటి ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ రోజు మరింత ఎగబాకింది. టీసీఎస్ దూకుడు ఇలాగే కొనసాగి, రిలయన్స్ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వారం రిలయన్స్ మార్కెట్ క్యాప్‌ను దాటినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. 


Updated Date - 2021-01-12T20:24:53+05:30 IST