టాటా కార్ల ధరలు పెంపు
ABN , First Publish Date - 2021-07-29T05:49:01+05:30 IST
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే వారం నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్టు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే వారం నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో ఉపయోగించే స్టీల్, ఇతర మెటల్స్ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు కంపెనీ ప్రయాణికుల వాహనాల విభాగం ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. తాము కేవలం 2.5 శాతం భారాన్ని మాత్రమే వినియోగదారులకు పంచినట్టు చంద్ర చెప్పారు.