నేటి నుంచి టాటా కార్ల ధరలు పెంపు
ABN , First Publish Date - 2021-05-08T12:48:18+05:30 IST
ప్రయాణికుల వాహనాలన్నింటి ధరలు శనివారం నుంచి పెరగనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్, వేరియెంట్‌ను బట్టి ఈ పెరుగుదల ఉంటుందంటూ...

న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాలన్నింటి ధరలు శనివారం నుంచి పెరగనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్, వేరియెంట్‌ను బట్టి ఈ పెరుగుదల ఉంటుందంటూ, ధరల్లో సగటు పెరుగుదల 1.8 శాతం ఉంటుందని తెలియచేసింది. పెరిగిన ముడిసరుకు వ్యయాల భారాన్ని తట్టుకునేందుకే పాక్షికంగా దాన్ని కస్టమర్లకు పంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. అయితే మే 7వ తేదీకి ముందుగా వాహనాలు బుక్ చేసుకున్న వారికి మాత్రం ఈ ధరల పెరుగుదల వర్తించదని, వారికి బుక్ చేసుకున్న నాటి ధరలే వర్తిస్తాయని పేర్కొంది.