ఎయిర్‌ ఇండియా బరిలో ‘టాటా’ ముందంజ

ABN , First Publish Date - 2021-05-02T06:44:33+05:30 IST

ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు జరుగుతున్న బిడ్డింగ్‌లో టాటా గ్రూప్‌ ముందంజలో ఉన్నట్లు సమాచారం...

ఎయిర్‌ ఇండియా బరిలో ‘టాటా’ ముందంజ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు జరుగుతున్న బిడ్డింగ్‌లో టాటా గ్రూప్‌ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్‌ మధ్యే పోటీ ఉంది. ప్రాథమిక బిడ్డింగ్‌లో స్పైస్‌జెట్‌ కంటే టాటా సన్స్‌ అధిక ధర కోట్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణను ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Updated Date - 2021-05-02T06:44:33+05:30 IST