‘స్విగ్గీ’కి రూ.5,862 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-04-06T06:28:41+05:30 IST

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై ఇంటివద్దకు ఆహారం సరఫరా చేసే స్విగ్గీ.. తాజాగా 80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,862 కోట్లు) నిధులు సమీకరించింది...

‘స్విగ్గీ’కి రూ.5,862 కోట్ల నిధులు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై ఇంటివద్దకు ఆహారం సరఫరా చేసే స్విగ్గీ.. తాజాగా 80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,862 కోట్లు) నిధులు సమీకరించింది. ఈ విడత కంపెనీలో ఫాల్కాన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌, అమాన్సా క్యాపిటల్‌, థింక్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌, కార్మిగ్నాక్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ పెట్టుబడులు పెట్టినట్లు స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి తెలిపారు. తద్వారా కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ 500 కోట్ల డాలర్ల (రూ.36,640 కోట్లు) చేరుకుంది. 


మీషో రూ.2,200 కోట్ల సమీకరణ: సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ 2తో పాటు తదితర ఇన్వెస్టర్ల నుంచి 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,201 కోట్లు) నిధులు సమీకరించినట్లు సోషల్‌ కామర్స్‌ కంపెనీ మీషో తెలిపింది. 


Updated Date - 2021-04-06T06:28:41+05:30 IST