సువెన్‌ లైఫ్‌ నష్టం రూ.22 కోట్లు

ABN , First Publish Date - 2021-05-05T06:41:07+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.21.61 కోట్ల నష్టాన్ని చవి చూసింది...

సువెన్‌ లైఫ్‌ నష్టం రూ.22 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.21.61 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఏడాది క్రితం ఇదే కాలం నష్టం రూ.25.55 కోట్లతో పోలిస్తే తగ్గిందని కంపెనీ వెల్లడించింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం కూడా రూ.11.65 కోట్ల నుంచి రూ.2.88 కోట్లకు పరిమితమైంది. 2020-21 ఏడాదికి ఆదాయం రూ.21.23 కోట్లు కాగా.. రూ.72.15 కోట్ల నష్టాన్ని చవి చూసింది.  


Updated Date - 2021-05-05T06:41:07+05:30 IST