ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు...

ABN , First Publish Date - 2021-01-12T19:29:14+05:30 IST

స్టాక్ మార్కెట్లు ఈ రోజు(మంగళవారం, (జనవరి 12) ఊగిసలాడుతున్నాయి. ఉదయం నుండి స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న 49 వేల మార్కు దాటిన సెన్సెక్స్ అదే మార్క్ వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 18 డాలర్లు లాభపడింది.

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్ మార్కెట్లు ఈ రోజు(మంగళవారం,  (జనవరి 12) ఊగిసలాడుతున్నాయి. ఉదయం నుండి స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న 49 వేల మార్కు దాటిన సెన్సెక్స్ అదే మార్క్ వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మాత్రం స్వల్పంగా 18 డాలర్లు లాభపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఫలితాలు అదరగొట్టాయి. ఆరంభం బాగుండడంతో నిన్న మార్కెట్లు జంప్ చేసిన విషయం తెలిసిందే. గత రెండు నెలల కాలంలోనే  7 వేల పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్.. ఈ రోజు మాత్రం ఊగిసలాటలో ఉన్నాయి. కరోనా నేపధ్యంలో బ్యాంకుల ఎన్పీఏలు పెరగవచ్చని, చెడు రుణాలు రెట్టింపు కావొచ్చునని ఆర్‌బీఐ అంచనాల నేపధ్యంలో బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడినెదుర్కొంటున్నాయి. 


ఈ రోజు ఉదయం 9.16 గంటలకు సెన్సెక్స్ 101.75 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 49,167.57 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26.80 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 14,458 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఇక... 629 షేర్లు లాభాల్లో 663 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 58 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పూలేదు. కాగా... 11.35 గంటలకు సెన్సెక్స్ 55 పాయింట్లు క్షీణించి 49,214 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ప్రారంభంలో నష్టాల్లో ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సెన్సెక్స్ నష్టాల్లో, నిఫ్టీ లాభనష్టాల ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఇక డాలర్ మారకంతో రూపాయి 73.43 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.38 వద్ద ముగిసింది. 


టాప్ లూజర్స్, గెయినర్స్... 

ఈ రోజు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో 10.40 శాతం, ఐచర్ మోటార్స్ 5.22 శాతం, గెయిల్ 4.24 శాతం, కోల్ ఇండియా 3.88 శాతం, ఐవోసీ 3.07 శాతం మేర లాభపడ్డాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 1.99 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.96 శాతం, టైటాన్ కంపెనీ 1.95 శాతం, సన్ ఫార్మా 1.71 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.66 శాతం నష్టాల్లో ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐశర్ మోటార్స్ ఉన్నాయి. రిలయన్స్ స్టాక్ ఈ రోజు 1.47 శాతం ఎగబాకి రూ. 1925 వద్ద ట్రేడ్ అయింది 


రంగాలవారీగా... 

నిఫ్టీ 50 సూచీ 0.02 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.21 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.21 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.11 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.38 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.78 శాతం, నిఫ్టీ మీడియా 1.22 శాతం, నిఫ్టీ మెటల్ 1.28 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.20 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.51 శాతం, నిఫ్టీ ఐటీ 0.20 శాతం, నిఫ్టీ ఫార్మా 0.92 శాతం, నిఫ్టీ ప్రైవేటు బ్యాంకు 0.24 శాతం నష్టపోయాయి.


Updated Date - 2021-01-12T19:29:14+05:30 IST