నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-03-22T21:16:47+05:30 IST

భారీ నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత కోలుకుని స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి

నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

భారీ నష్టాలతో రోజును ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో కాస్త కోలుకుని స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. రోజంతా నష్టాల్లోనే కదలాడిన మార్కెట్లు చివర్లో కాస్త కోలుకున్నాయి. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండడంతోపాటు కీలక బ్యాంకింగ్‌ రంగం‌లోని షేర్లు డీలా పడడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. 49,878 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 86 పాయింట్లు కోల్పోయి 49771 వద్ద రోజును ముగించింది. ఒక దశలో 49,281 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత తేరుకుని స్వల్ప నష్టంతో రోజును ముగించింది. ఇక, 14,736 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టిన నిఫ్టీ 7 పాయింట్లను కోల్పోయింది. అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాలు ఆర్జించగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ నష్టాలను చవిచూశాయి. 

Updated Date - 2021-03-22T21:16:47+05:30 IST