2020 లో పడిలేచిన స్టాక్ మార్కెట్...

ABN , First Publish Date - 2021-01-01T17:28:02+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు 2020 సంవత్సరంలో భారీగా పతనమై, ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాయి. గత రెండు నెలలుగా ప్రతి వారం సరికొత్త శిఖరాలను తాకాయి.

2020 లో పడిలేచిన స్టాక్ మార్కెట్...

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు 2020 సంవత్సరంలో భారీగా పతనమై, ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా పైకి లేచాయి. గత రెండు నెలలుగా ప్రతి వారం సరికొత్త శిఖరాలను తాకాయి. కరోనా దెబ్బకు మార్చి ప్రారంభంలో కుప్పకూలిన మార్కెట్లు... 2020 ముగిసి, 2021 లోకి ప్రవేశించే సమయానికి దూసుకెళ్లాయి.


ఇక... కరోనా సంక్షోభ సమయంలో పదిహేనుశాతం జంప్ చేశాయి. ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. మొత్తంమీద 2020 లో స్టాక్ మార్కెట్లు అత్యంత దారుణ పతనాన్ని, అదే సమయంలో అత్యంత ఎత్తులకు చేరి రికార్డులు సృష్టించాయి. ఇన్వెస్టర్లు 2021 లోకి అత్యంత సానుకూల ధోరణితో అడుగు పెట్టారు .


కాగా... 2020 జనవరి మధ్యలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. మార్చి మధ్యలో పతనం అయ్యాయి. అన్-లాక్ తర్వాత కోలుకున్నాయి. భారీ పతనం నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందోనన్న ఆందోళన కనిపించేలోపు అంతకంటే పైకి లేచి ఇన్వెస్టర్లను మురిపించింది. 

Updated Date - 2021-01-01T17:28:02+05:30 IST