తిరుపతి నుంచి స్టార్ ఎయిర్ సర్వీసులు షురూ
ABN , First Publish Date - 2021-01-12T09:15:36+05:30 IST
తిరుపతి విమానాశ్రయం నుంచి స్టార్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

రేణిగుంట: తిరుపతి విమానాశ్రయం నుంచి స్టార్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆది, సోమ, బుధ, శుక్ర వారాల్లో తిరుపతి నుంచి హుబ్లీ, గుల్బర్గాలకు 50 సీట్లతో కూడిన విమానాన్ని నడపనున్నట్లు స్టార్ ఎయిర్ ప్రతినిధి సునీల్ కుమార్ తెలిపారు. రూ.999 ధరకే విమాన ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేశ్ పాల్గొన్నారు.