స్పైస్‌జెట్‌ 66 కొత్త సర్వీసులు

ABN , First Publish Date - 2021-03-14T06:26:08+05:30 IST

ఈ నెల 28 నుంచి పలు రూట్లలో 66 కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. వీటిలో కొన్ని కొత్త సర్వీసులుండగా మరికొన్ని ప్రస్తుతం నడుస్తున్న రూట్లలో అదనపు సర్వీసులున్నాయి

స్పైస్‌జెట్‌ 66 కొత్త సర్వీసులు

న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి పలు రూట్లలో 66 కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. వీటిలో కొన్ని కొత్త సర్వీసులుండగా మరికొన్ని ప్రస్తుతం నడుస్తున్న రూట్లలో అదనపు సర్వీసులున్నాయి. ఉడాన్‌ పథకం కింద చిన్న నగరాలకు పెరిగిన ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కొత్త సర్వీసుల్లో హైదరాబాద్‌-దర్భాంగా సర్వీసు ఒకటుంది. ఇది కాకుండా హైదరాబాద్‌-ముంబై నాన్‌స్టాప్‌ సర్వీసు కూడా అందుబాటులోకి రానుంది.

Updated Date - 2021-03-14T06:26:08+05:30 IST