ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఎంఎన్‌పీని అనుమతించండి

ABN , First Publish Date - 2021-12-08T08:03:54+05:30 IST

టెలికాం కంపెనీలన్నీ టారిఫ్‌ వోచర్లు, ఆఫర్లు, ప్లాన్లతో సంబంధం లేకుండా మొబైల్‌ యూజర్లందరికీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా నంబర్‌ పోర్టబులిటీ....

ఎస్‌ఎంఎస్‌ ద్వారా  ఎంఎన్‌పీని అనుమతించండి

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలన్నీ టారిఫ్‌ వోచర్లు, ఆఫర్లు, ప్లాన్లతో సంబంధం లేకుండా మొబైల్‌ యూజర్లందరికీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా నంబర్‌ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) కోరే సదుపాయం కల్పించాలని ఆదేశించింది. తమ ప్రీపెయిడ్‌ అకౌంట్లలో తగినంత బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ యూపీసీకి నిర్దేశించిన 1900 ద్వారా ఎస్‌ఎంఎస్‌ సహాయంతో పోర్టబులిటీని కోరలేకుండా ఉన్నామని ట్రాయ్‌కి ఇటీవల కొన్ని ఫిర్యాదులందాయి. తక్షణం టెలికాం కంపెనీలన్నీ తమ ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లందరికీ 1900 ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపి నంబర్‌ పోర్టబులిటీ కోరే అవకాశం అందుబాటులోకి తేవాలని ట్రాయ్‌ తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఎంఎన్‌పీ కోసం ఎస్‌ఎంఎస్‌ పంపే సదుపాయం నిరాకరించడం కస్టమర్ల హక్కులను నిరాకరించడమే అవుతుందని, ఇది నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించింది. 

Updated Date - 2021-12-08T08:03:54+05:30 IST