ఫేస్‌బుక్‌ వేదికగా చిన్న వ్యాపార రుణాలు

ABN , First Publish Date - 2021-08-21T07:31:14+05:30 IST

చిన్న, మధ్య తరహా వ్యాపారులు (ఎస్‌ఎంబీ) త్వరితగతిన రుణాలు

ఫేస్‌బుక్‌ వేదికగా చిన్న వ్యాపార రుణాలు

ముంబై: చిన్న, మధ్య తరహా వ్యాపారులు (ఎస్‌ఎంబీ) త్వరితగతిన రుణాలు పొందే సదుపాయం అందుబాటులోకి తేవడానికి ఫేస్‌బుక్‌ శుక్రవారం ఒక ప్రత్యేక వేదికను ప్రారంభించింది. దీని కింద తమతో భాగస్వాములైన స్వతంత్ర రుణదాతలను ఎస్‌ఎంబీలకు అనుసంధానం చేస్తారు. ఫేస్‌బుక్‌ ఇలాంటి సదుపాయం అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం భారత్‌. 200 నగరాలు, పట్టణాలకు చెందిన వ్యాపారులు దీనిలో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 


Updated Date - 2021-08-21T07:31:14+05:30 IST