యూకేలో సీరమ్ భారీ పెట్టుబడులు!

ABN , First Publish Date - 2021-05-04T20:59:27+05:30 IST

భారత వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) యూకేలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైం

యూకేలో సీరమ్ భారీ పెట్టుబడులు!

భారత వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(సీఐఐ) యూకేలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. యూకేలో సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సీరమ్ 240 మిలియన్‌ పౌండ్లు (దాదాపు రూ.2459 కోట్లు) పెట్టుబడి పెట్టబోతోంది. ఈ విషయాన్ని యూకే అధికారికంగా ప్రకటించింది. అక్కడ ఓ విక్రయ కేంద్రాన్ని కూడా సీరమ్ ఏర్పాటు చేయబోతోంది.


భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వర్చువల్‌ సమావేశానికి ముందు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈ ప్రకటన వెలువడింది. భారత్‌తో కుదిరిన బిలియన్‌ డాలర్ల వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సీరమ్ యూకేలో పెట్టుబడులు పెట్టబోతోంది. సీరమ్ మాత్రమే కాకుండా హెల్త్‌కేర్‌, బయోటెక్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోని వివిధ భారతీయ కంపెనీలు యూకేలో పెట్టుబడులు పెట్టనున్నట్టు సమాచారం. ఈ పెట్టుబడులతో యూకేలో 6,500 ఉద్యోగాల సృష్టి జరగనున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2021-05-04T20:59:27+05:30 IST