సెన్సెక్స్ జయహో
ABN , First Publish Date - 2021-12-09T06:27:44+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద, 293.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,469.75 వద్ద ముగిశాయి.

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద, 293.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,469.75 వద్ద ముగిశాయి. దీంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) రూ.3.96 లక్షల కోట్లు పెరిగింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదన్న వార్తలు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి.