సెన్సెక్స్‌ : 49,000

ABN , First Publish Date - 2021-01-12T09:31:14+05:30 IST

మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాల సీజన్‌పై ఆశాజనక అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లలో ఉత్సాహం నింపాయి. ఐటీ, ఫైనాన్స్‌, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 49,000 మైలురాయిని దాటింది.

సెన్సెక్స్‌ : 49,000

ముంబై: మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాల సీజన్‌పై ఆశాజనక అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడర్లలో ఉత్సాహం నింపాయి. ఐటీ, ఫైనాన్స్‌, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 49,000 మైలురాయిని దాటింది. సోమవారం ట్రేడింగ్‌ నిలిచేసరికి సూచీ 486.81 పాయింట్ల లాభంతో 49,269.32 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 137.50 పాయింట్లు పెరుగుదలతో 14,484.75 వద్ద పరుగు ఆపింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలకు సరికొత్త జీవనకాల గరిష్ఠ ముగింపు స్థాయిలివి. అలాగే, సెన్సెక్స్‌ 49,303.79 వద్ద, నిఫ్టీ 14,498.20 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసుకున్నాయి. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం సరికొత్త రికార్డు స్థాయి రూ.196.56 లక్షల కోట్లకు చేరుకుంది.

 

ఐటీ షేర్లు జిగేల్‌ 

క్యూ3 సీజన్‌కు బోణీ కొట్టిన టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలు మించడంతో ఆ కంపెనీతోపాటు ఐటీ రంగ ప్రధాన షేర్లన్నీ లాభాల్లో పయనించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఏకంగా 6.09 శాతం లాభంతో సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ సూచీలో లిస్టయిన ఇన్ఫోసిస్‌ 4.90 శాతం, విప్రో 3.87 శాతం, టెక్‌ మహీంద్రా 2.54 శాతం బలపడ్డాయి. బీఎ్‌సఈ ఐటీ, టెక్నాలజీ రంగ సూచీలు సైతం వరుసగా 3.63 శాతం, 3.11 శాతం పుంజుకున్నాయి. 


20 లాభాల్లో.. 10 నష్టాల్లో..

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 20 లాభాల్లో పయనించగా.. మిగతా 10 నష్టాలు చవిచూశాయి. సూచీలోని ఐటీయేతర షేర్లలో హెచ్‌డీఎ్‌ఫసీ 3.70 శాతం బలపడగా.. మారుతి సుజుకీ, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా 2 శాతానికి పైగా పెరిగాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ ఒక శాతం పైగా నష్టపోయాయి. 


రూ.12 లక్షల కోట్ల టీసీఎస్‌ 

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ మరో చరిత్ర సృష్టించింది. తాజాగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12 లక్షల కోట్ల మైలురాయిని తాకింది. ఈ స్థాయికి చేరిన తొలి ఐటీ కంపెనీ ఇదే. మూడో త్రైమాసికానికి టీసీఎస్‌ మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో సోమవారం బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర 3.32 శాతం మేర పుంజుకొని రూ.3,224కు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.12,09,768 కోట్లకు ఎగబాకింది. అయితే, చివర్లో కంపెనీ షేరు 1.75 శాతం లాభంతో రూ.3,175.05 వద్ద స్ధిరపడింది. దాంతో మార్కెట్‌ క్యాప్‌ రూ.11,91,400.91 కోట్లకు తగ్గింది. బీఎ్‌సఈలో కంపెనీకి చెందిన 2.54 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 95 లక్షల షేర్లు చేతులు మారాయి. 


ఏడాది గరిష్ఠానికి అపోలో మైక్రోసిస్టమ్స్‌ షేరు 

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ నుంచి రూ.50 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకున్న అపోలో మైక్రోసిస్టమ్స్‌ షేర్లు బీఎ్‌సఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 20 శాతం పుంజుకొని రూ.155.20 వద్దకు చేరుకున్నాయి. తద్వారా 52 వారాల సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసుకున్నాయి. చివర్లో కంపెనీ షేరు ధర 13.81 శాతం లాభంతో రూ.147.55 వద్ద ముగిసింది. 

Updated Date - 2021-01-12T09:31:14+05:30 IST