అంబానీలకు సెబీ రూ.25 కోట్ల పెనాల్టీ

ABN , First Publish Date - 2021-04-08T06:05:37+05:30 IST

ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, వారి భార్యలు నీతా, టీనా అంబానీలపై సెబీ రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ టేకోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిందన్న కేసులో సెబీ ఈ చర్య తీసుకుంది

అంబానీలకు సెబీ రూ.25 కోట్ల పెనాల్టీ

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ, వారి భార్యలు నీతా, టీనా అంబానీలపై సెబీ రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ టేకోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిందన్న కేసులో సెబీ ఈ చర్య తీసుకుంది. ఆర్‌ఐఎల్‌ ప్రమోటర్లయిన వీరు కొంత మందితో కుమ్మక్కయి 5 శాతం వాటాల స్వాధీనానికి సంబంధించిన వివరాలు ప్రకటించకపోవడం నేరంగా పరిగణించినట్టు తెలిపింది. ఈ కారణంగా కంపెనీ నుంచి తప్పుకునే హక్కు/అవకాశం ఇతర వాటాదారులకు నిరాకరించినట్టయిందంటూ అందుకు వారిపై పెనాల్టీ విధిస్తున్నట్టు తెలిపింది. 

Updated Date - 2021-04-08T06:05:37+05:30 IST