ఎస్‌బీఐ ‘నమస్తే యూకే’ అకౌంట్‌

ABN , First Publish Date - 2021-12-19T08:03:33+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో శతాబ్ది సంవత్సర ఉత్సవాలను జరుపుకుంటోంది. ....

ఎస్‌బీఐ ‘నమస్తే యూకే’ అకౌంట్‌

 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో శతాబ్ది సంవత్సర ఉత్సవాలను  జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బ్యాంక్‌ ‘నమస్తే యూకే’ అకౌంట్‌ సేవలను ప్రారంభించింది. దీర్ఘకాలిక వీసాలపై యూకేకు వచ్చే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఈ అకౌంట్‌  ప్రయోజనకరమని, భారత్‌ నుంచి బయలుదేరకముందే బ్రిటన్‌లో బ్యాంక్‌ ఖాతా తెరిచేందుకు వీలు కల్పిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. కొత్త ఏడాదిలో చాలా మంది భారత విద్యార్థులు, వృత్తి నిపుణులు బ్రిటన్‌కు రానున్న తరుణంలో ఈ కొత్త అకౌంట్‌ సేవలపై ఆసక్తి పెరగవచ్చని ఎస్‌బీఐ యూకే చీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ 1921 లోనే యూకేలో శాఖను ఏర్పాటు చేసింది. 

Updated Date - 2021-12-19T08:03:33+05:30 IST