Srinagar: హౌస్‌బోట్‌లో SBI Floating ఏటీఎం ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-22T21:50:33+05:30 IST
Srinagar: హౌస్‌బోట్‌లో SBI Floating ఏటీఎం ప్రారంభం
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద హౌస్‌బోట్‌లో ఫ్లోటింగ్ ఏటీఎంను ప్రారంభించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఏటీఎంను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ఆగస్టు 16న ప్రారంభించారు."శ్రీనగర్ ఆకర్షణకు" ఏటీఎం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. స్థానికులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీనగర్‌లోని డాల్‌లేక్‌లో హౌస్‌బోట్‌లో ఏటీఎంను ఎస్‌బీఐ ప్రారంభించింది. ప్రఖ్యాత దాల్ సరస్సులోని ఫ్లోటింగ్ ఏటీఎం అవసరాలను తీరుస్తుందని బ్యాంక్ ట్వీట్ చేసింది. అక్కడ ఫ్లోటింగ్ కూరగాయల మార్కెట్, తేలియాడే పోస్టాఫీసు కూడా ఉంది.