పెద్ద లావాదేవీలు... ఎస్‌బీఐ కొత్త నిబంధన...

ABN , First Publish Date - 2021-01-12T22:36:22+05:30 IST

చెక్కుల ద్వారా చేసే లావాదేవీలకు సంబంధించి మరింత భద్రత కోసం ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పాజిటివ్ పే సిస్టంను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధన ప్రకారం రూ. 50 వేలకంటే ఎక్కువ చెల్లింపులకు కీలక వివరాలు పునఃనిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

పెద్ద లావాదేవీలు... ఎస్‌బీఐ కొత్త నిబంధన...

 ముంబై : చెక్కుల ద్వారా చేసే లావాదేవీలకు సంబంధించి మరింత భద్రత కోసం ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పాజిటివ్ పే సిస్టంను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధన ప్రకారం రూ. 50 వేలకంటే ఎక్కువ చెల్లింపులకు కీలక వివరాలు పునఃనిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలు జనవరి 1, 2021 నుండే అమల్లోకి వచ్చాయి. వీటిలో అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్కు వ్యాల్యూ, చెక్కు చెల్లింపులకు సంబంధించిన తేదీ, చెల్లిస్తున్న వారి పేరు వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 


పాజిటివ్ పే ప్రక్రియలో అధిక విలువ కలిగిన చెక్కుల ముఖ్యమైన వివరాలు తిరిగి ధృవీకరించే ప్రక్రియ ఉంటుంది. చెక్కు ఇచ్చేవారు ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా బ్యాంకుకు అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుంది. చెక్కు కొన్ని కనీస వివరాలు అందించాలి. ఏదైనా తేడా ఉందని సీటీఎస్ గుర్తిస్తే బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటాయి. ఈ సదుపాయాన్ని కల్పించాలని నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్‌బీఐ ఆదేశించింది. 
Updated Date - 2021-01-12T22:36:22+05:30 IST