విఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రభుత్వ వాటా అమ్మకం

ABN , First Publish Date - 2021-01-20T08:53:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వీఎ్‌సఎన్‌ఎల్‌ (ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌)లో తనకున్న 26.12 శాతం వాటాను ఉపసంహరించుకోనుంది.

విఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రభుత్వ వాటా అమ్మకం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వీఎ్‌సఎన్‌ఎల్‌ (ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌)లో తనకున్న 26.12 శాతం వాటాను ఉపసంహరించుకోనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌), వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం నాడు బీఎ్‌సఈలో టాటా కమ్యూనికేషన్స్‌ షేరు ధర 1.08 శాతం పెరిగి రూ.1,129.95 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం.. కంపెనీలో 26.12 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.8,400 కోట్ల మేర సమకూరనుంది. ప్రభుత్వ రంగానికి చెందిన విదేశీ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(వీఎ్‌సఎన్‌ఎల్‌)ను 2002లో ప్రైవేటీకరించారు.


అప్పట్లో కంపెనీలోని 25 శాతం వాటాతోపాటు యాజమాన్య నియంత్రణ హక్కులను వ్యూహాత్మక భాగస్వామికి పానటోన్‌ ఫిన్‌వె్‌స్టకు విక్రయించింది ప్రభుత్వం. ఆ తర్వాత కంపెనీ పేరును టాటా కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌గా మార్చారు. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రమోటర్లకు 74.99 శాతం వాటా ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 26.12 శాతం కాగా.. పానటోన్‌ ఫిన్‌వె్‌స్టకు 34.80 శాతం, టాటా సన్స్‌కు 14.07 శాతం వాటా ఉంది. మిగతా 25.01 శాతం వాటా పబ్లిక్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉంది. 

Updated Date - 2021-01-20T08:53:17+05:30 IST