సైమాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

ABN , First Publish Date - 2021-11-23T08:27:19+05:30 IST

భారత్‌లో తొలిసారిగా అగ్‌మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌) సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు,...

సైమాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : భారత్‌లో తొలిసారిగా అగ్‌మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌) సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు, ఆవిష్కరణలతో కూడి న టెక్నోపార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సైమాక్స్‌ ప్రకటించింది. శంషాబాద్‌లోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెక్నో పార్క్‌ను నెలకొల్పుతున్నట్లు సైమాక్స్‌ చైర్మన్‌ జీ రాఘవ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్‌ కంపెనీలతో పాటు అగ్రశ్రేణి కంపెనీలకు ఈ పార్క్‌ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కాగా ఈ టెక్నోపార్క్‌లో మల్టీమీడియా, వీఎ్‌ఫఎక్స్‌, సాప్ట్‌వేర్‌ రంగాలకు అనుబంధంగా కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-11-23T08:27:19+05:30 IST