ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ఆర్‌ఓసీగా సాయి శంకర్‌

ABN , First Publish Date - 2021-12-31T09:10:47+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)గా సాయి శంకర్‌ లండ బాధ్యతలు స్వీకరించారు. సాయి శంకర్‌ 2015 బ్యాచ్‌కు చెంది

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ఆర్‌ఓసీగా సాయి శంకర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)గా సాయి శంకర్‌ లండ బాధ్యతలు స్వీకరించారు. సాయి శంకర్‌ 2015 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ (ఐసీఎల్‌ఎస్‌) ఆఫీసర్‌. సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఐసీఎల్‌ఎస్‌కు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఓసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మొదటి అసిస్టెంట్‌ ఆర్‌ఓసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మూడేళ్ల తర్వాత పదోన్నతి మీద డిప్యూటీ ఆర్‌ఓసీగా బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని కొవ్వాడ పేట గ్రామానికి చెందిన సాయి.. గతంలో ఢిల్లీలో అసిస్టెంట్‌ అఫీషియల్‌ లిక్విడేటర్‌గా పనిచేశారు. 

Updated Date - 2021-12-31T09:10:47+05:30 IST