రెండేళ్లు ఒకే రేటింగ్‌: ఎస్‌ అండ్‌ పీ

ABN , First Publish Date - 2021-05-08T08:36:22+05:30 IST

భారత పరపతి రేటింగ్‌ రాబోయే రెండేళ్లకు ఒకే స్థాయిలో ఉంచుతున్నట్టు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది.

రెండేళ్లు ఒకే రేటింగ్‌: ఎస్‌ అండ్‌ పీ

న్యూఢిల్లీ: భారత పరపతి రేటింగ్‌ రాబోయే రెండేళ్లకు ఒకే స్థాయిలో ఉంచుతున్నట్టు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. రెండేళ్ల పాటు ప్రస్తుత రేటింగ్‌ కొనసాగే స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ స్వల్పంగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని తెలిపింది. ప్రస్తుతం భారత్‌కు ‘బిబిబి-’ రేటింగ్‌ అమలులో ఉంది. రెండో విడత కరోనా ఉదృతి ప్రభావం రికవరీపై గట్టి ప్రభావం చూపే ఆస్కారం ఉందని తెలిపింది.   

 

ముప్పు పెరిగింది: ఆర్థిక శాఖ

దేశంలో కరోనా వైరస్‌ రెండో విజృంభణ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గే ముప్పు ఏర్పడిందని, ఫలితంగా రికవరీకి అవరోధం ఏర్పడవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే తొలి విడతలో ఏర్పడిన ప్రభావంతో పోల్చితే ఇప్పుడు కాస్తంత తక్కువగానే ఉండవచ్చని పేర్కొంది. 

Updated Date - 2021-05-08T08:36:22+05:30 IST