రూ.లక్ష... సంవత్సరం... రూ. 2 కోట్లు...

ABN , First Publish Date - 2021-10-26T02:07:18+05:30 IST

స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలుంటాయి. అదే సమయంలో భారీ నష్టాల కూడా ఉంటాయి. అంటే... భారీ రిస్క్ కూడా ఉంటుందన్నది తెలిసిన విషయమే.

రూ.లక్ష... సంవత్సరం... రూ. 2 కోట్లు...

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలుంటాయి. అదే సమయంలో భారీ నష్టాల కూడా ఉంటాయి. అంటే... భారీ రిస్క్ కూడా ఉంటుందన్నది తెలిసిన విషయమే. మార్కెట్‌లో చాలా షేర్లు ఉంటాయి. అయితే అన్నీ ఒకే రకమైన రాబడిని అందించవు. కొన్ని షేర్లు భారీ దిరే రాబడిని అందించేవిగా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో గోపాల్ పాలీప్లాస్ట్ కూడా ఒకటి. గత ఏడాది కాలంలో ఈ షేరు  రూ. 4.45 నుంచి ఏకంగా రూ. 998.45 కి చేరింది.


అంటే గోపాల పాలీప్లాస్ట్ షేరు ధర గత ఏడాది కాలంలో ఏకంగా 22300 శాతం ర్యాలీ చేసింది. ఈ షేరులో డబ్బు పెట్టిన వారి పంట పండిందని చెప్పాలి. గోపాల పాలీప్లాస్ట్ షేరులో ఏడాది కిందట రూ. లక్ష పెట్టి ఉంటే, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 2.24 కోట్లు అయిఉంటుంది. ఏడాదిలోనే ఈ స్థాయి రాబడి అంటే మాసాధారణమైన విషయం కాదు. అయితే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు భారీ రిస్క్ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. 

Updated Date - 2021-10-26T02:07:18+05:30 IST