నిరోధ స్థాయిలు 15800-16000

ABN , First Publish Date - 2021-07-12T07:38:58+05:30 IST

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌ ధోరణిని కొనసాగించి చివరికి 32 పాయింట్ల నష్టంతో ముగిసింది. 15900 వరకు వెళ్లినా నిలదొక్కుకోలేక 15600 స్థాయికి దిగజారి చివరిలో స్వల్ప రికవరీ సాధించింది.

నిరోధ స్థాయిలు 15800-16000

నిఫ్టీ గత వారం సైడ్‌వేస్‌ ధోరణిని కొనసాగించి చివరికి 32 పాయింట్ల నష్టంతో ముగిసింది. 15900 వరకు వెళ్లినా నిలదొక్కుకోలేక 15600 స్థాయికి దిగజారి చివరిలో స్వల్ప రికవరీ సాధించింది. వీక్లీ చార్టు ల్లో వారం కనిష్ఠ స్థాయిల్లో ముగియడం అప్రమత్తతను సూచిస్తోంది. ప్రధాన మద్దతు స్థాయి 15500 కన్నా పైనే ఉన్నందువల్ల ఇప్పటికీ ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉంది. గత 5 వారాలుగా మార్కెట్‌ కన్సాలిడేషన్‌ ధోరణిలో ట్రేడవుతూ 15900-15600 మధ్యన కదలాడుతోంది. తాజా ట్రెండ్‌ కోసం ఈ స్థాయిల్లో ఏదో ఒక దాన్ని బ్రేక్‌ చేయాలి. ఇప్పుడు మైనర్‌ రికవరీకి ఆస్కారం ఉన్నందు వల్ల నిరోధ స్థాయిల్లో పరీక్ష ఎదుర్కొనవచ్చు. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 15850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 16000. ఆ పైన మాత్రమే మరింత ర్యాలీకి ఆస్కారం ఉంది. 


బేరిష్‌ స్థాయిలు: భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 15650 కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. విఫలమై మరో ప్రధాన మద్దతు స్థాయి 15450 కన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌ తప్పదు. 


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ 260 పాయింట్ల స్వల్ప లాభంతో 35000 వద్ద క్లోజైంది. ఇటీవల సాధించిన పరిధి 35800-33900 మధ్యన అనిశ్చితంగా ముగిసింది. ప్రధాన నిరోధ స్థాయిలు 35600, 36000. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంది. 


పాటర్న్‌: మార్కెట్‌ కదలిక చతురస్రాకారంగా ఉంది. ప్రస్తుతం 50 డిఎంఏ కన్నా పైన ఉంది. వీక్లీ చార్టుల్లో కూడా 10 వారాల సగటు వద్ద నిలిచి ఉంది. మార్కెట్‌ ప్రధాన స్వల్పకాలిక దిశ తీసుకునేందుకు సమాయత్తం అవుతోందనేందుకు ఇది సంకేతం. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 

  

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది. 

Updated Date - 2021-07-12T07:38:58+05:30 IST