రిలయన్స్‌ క్యాపిటల్‌పై దివాలా ప్రక్రియ షురూ

ABN , First Publish Date - 2021-12-07T06:20:00+05:30 IST

అనిల్‌ అంబానీ నేతృత్వంలో ని రిలయన్స్‌ క్యాపిటల్‌ కథ కంచికి చేరుతోంది. ఈ కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలన్న

రిలయన్స్‌ క్యాపిటల్‌పై దివాలా ప్రక్రియ షురూ

ముంబై: అనిల్‌ అంబానీ నేతృత్వంలో ని రిలయన్స్‌ క్యాపిటల్‌ కథ కంచికి చేరుతోంది. ఈ కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలన్న ఆర్‌బీఐ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఆమోదించింది. ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఆర్‌బీఐ గత వారమే రద్దు చేసింది. నిర్వహణపరమైన అంశాలతో పాటు రుణాల చెల్లింపుల్లో కంపెనీ విఫలమవడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ తర్వాత ఒక పెద్ద ఫైనాన్స్‌ సంస్థ ఎన్‌సీఎల్‌టీ పరిధిలోకి రావడం ఇదేమొదటిసారి. 

Updated Date - 2021-12-07T06:20:00+05:30 IST