రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో... భారీ ఒప్పందాలకు అవకాశం...

ABN , First Publish Date - 2021-06-22T00:39:18+05:30 IST

లయన్స్ యాన్యువల్ షేర్ హోల్డర్స్ సమావేశం(ఏజీఎం)పై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొని ఉంది. ఈ నెల 24 న ఈ సమావేశం జరగనుంది.

రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో... భారీ ఒప్పందాలకు అవకాశం...

ముంబై :  రిలయన్స్ యాన్యువల్ షేర్ హోల్డర్స్ సమావేశం(ఏజీఎం)పై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొని ఉంది. ఈ నెల 24 న ఈ సమావేశం  జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ కంపెనీ ప్రకటనలు చేయనున్నట్లు వినవస్తోంది. టెలికం రంగంలో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే, ఆయిల్ టు కెమికల్స్ఓ2సీ) రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు వివిధ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.


ఈ నేపధ్యంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా... 4జీ రాకతో రిలయన్స్ ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. గ్రామాలకు కూడా 4జీ టెక్నాలజీనందించడంలో ముఖ్యపాత్ర పోషించింది. వచ్చే భేటీలో అతి తక్కువ ధరకు 4జీ ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా... రిలయన్స్ ఏజీఎం భేటీలో భారీ ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాల్లో వినవస్తోంది. 

Updated Date - 2021-06-22T00:39:18+05:30 IST