జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2021-05-02T07:00:52+05:30 IST

జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.41 లక్షల కోట్లకు పెరిగాయి...

జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

  • ఏప్రిల్‌లో రూ.1.41 లక్షల కోట్లకు చేరిక 

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఏడో నెలా రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.41 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చిలో నమోదైన రూ.1.23 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే 14 శాతం అధికమిది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇది స్పష్టమైన సంకేతమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2020 ఏప్రిల్‌లో జీఎ్‌సటీ ఆదాయం రూ.32,172 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత నెలల్లో వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చి, 2020 అక్టోబరులో మళ్లీ రూ.లక్ష కోట్లకు చేరాయి. అప్పటి నుంచి ప్రతినెలా వసూళ్లు ఈ మైలురాయికి ఎగువన నమోదవడమే కాకుండా నెలనెలా పెరుగుతూ వచ్చాయి. మళ్లీ తగ్గనున్న వసూళ్లు : గత నెల జీఎ్‌సటీ వసూళ్లు మార్చిలో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి. దేశంలో కరోనా రెండో దశ ఉధృతిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు స్థానిక లాక్‌డౌన్‌లు విధించాయి. మిగతా రాష్ట్రాల్లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. కరోనా తీవ్రత మరో 1-2 నెలల వరకు కొనసాగే అవకాశాలున్నాయి. కాబట్టి, మున్ముందు నెలల్లో జీఎ్‌సటీ ఆదాయం మళ్లీ  తగ్గనుందని పన్ను నిపుణులు తెలిపారు. 


Updated Date - 2021-05-02T07:00:52+05:30 IST