రూ. 97 కోట్ల నష్టం వచ్చింది... హ్యాపీగా చెప్పాడు...
ABN , First Publish Date - 2021-11-29T00:00:33+05:30 IST
వ్యాపారంలో కష్టనష్టాలు సర్వసాధారణం. ఎన్నో కష్టాలకు ఓరిస్తేనే... ఒక కంపెనీ ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. నష్టమొస్తుందని తెలిస్తే ఏ వ్యాపారైనా ముందడుగు వేస్తాడా ? ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరనే సమాధానమే సాధారణంగా వినవస్తుంది.

లండన్ : వ్యాపారంలో కష్టనష్టాలు సర్వసాధారణం. ఎన్నో కష్టాలకు ఓరిస్తేనే... ఒక కంపెనీ ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. నష్టమొస్తుందని తెలిస్తే ఏ వ్యాపారైనా ముందడుగు వేస్తాడా ? ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరనే సమాధానమే సాధారణంగా వినవస్తుంది. కానీ... ఆయన మాత్రం ఆనందంగా తీసుకున్నారు. అది కూడా ప్రజా సంక్షేమమే ముఖ్యమని చెబుతూ. ఇది జరిగింది బ్రిటన్‌లో. వివరాలిలా ఉన్నాయి. యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లష్. మొన్న(శుక్రవారం) కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లష్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ ఖాతాట్‌లను పూర్తిగా తొలగించింది. ఎందుకు డిలీట్ చేసిందో తెలిస్తే షాక్ అవడం ఖాయం.
సోషల్ మీడియా ప్రభావం టీనేజర్లపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను లష్ గట్టిగా నమ్ముతోంది. పిల్లల ప్రాణాలను బలిగొనే ఆ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తామెలా ప్రమోట్ చేసుకోగలమని లష్ కంపెనీ ప్రశ్నిస్తోంది. ఖాతాదారుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం తమకెందుకంటూ కంపెనీ ప్రశ్నిస్తోంది. మరోవైపు దశాబ్దానికి పైగా పోరాడుతున్నప్పటికీ... ‘వాతావరణం మార్పు’ అంశాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పట్టించుకోవడంలేదని, ఇక దానిపై వచ్చే ఆదాయం తమకు అవసరం లేదని, ఈ క్రమంలోనే... ఖాతాలను తొలగిస్తున్నామని లష్ ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ఒక్క ఫేస్‌బుక్ ఖాతాను తొలగించినందుకే 10 మిలియన్ పౌండ్లు(మన కరెన్సీలో రూ. 97.50 కోట్లకు పైమాటే.. ఇక విషయమేమిటంటే... ‘నష్టం వాటిల్లింది’ అంటూ కంపెనీ సీఈవో మార్క్ కంస్టాన్‌టైన్ సంతోషంగా ప్రకటించడం. అంతేకాదు... డిలీట్ చేసిన మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కలిపితే ఆ నష్టం మరో మూడు, నాలుగు మిలియన్ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన వెల్లడించారు.
కొవిడ్ ఆటుపోట్లనే ఎదుర్కొన్న తమకు ఇదో లెక్క కాదని మార్క్ కంస్టాన్‌టైన్ చిరునవ్వుతో పేర్కొన్నారు. అసలే... ప్రస్తుత సంవత్సరం ముగియబోతోంది., కొత్త సంవత్సరం రాబోతోంది... ఈ సమయం... సోషల్ మీడియాను ప్రమోషన్స్ కోసం బీభత్సంగా వాడే టైమ్. ఈ టైమ్‌లో లష్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుండడంలో ఆశ్చర్యం లేదు.