మార్కెట్ జంప్... కారణాలివే...

ABN , First Publish Date - 2021-09-03T00:00:11+05:30 IST

నాలుగు రోజుల పాటు భారీ లాభాల్లో ముగియడంతో పాటు ‘మార్కెట్’ సరికొత్త ‘రికార్డ్’ సృష్టించింది.

మార్కెట్ జంప్... కారణాలివే...

ముంబై : నాలుగు రోజుల పాటు భారీ లాభాల్లో ముగియడంతో పాటు ‘మార్కెట్’ సరికొత్త ‘రికార్డ్’ సృష్టించింది. కాగా... నిన్న ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు నష్టపోయాయి. అయితే ఈ రోజు మాత్రం... సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.30 గంటల సమయానికి సెన్సెక్స్ 57,600 పాయింట్లు దాటేసి, 58 వేల దిశగా పరుగులు పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాభావం, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాల నేపధ్యంలో... కొనుగోళ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. డాలర్ మారకంతో రూపాయి బలపడడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


నిన్నటికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,50,15,326.61 కోట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల సంపద గత ఐదు ట్రేడింగ్‌లలో రూ. 8 లక్షల కోట్లకు పైగా పెరిగి, రూ.250 లక్షల కోట్లకు చేరింది. ఇక...ప్రాఫిట్ బుకింగ్ నేపధ్యంలో సూచీలు అప్పుడప్పుడు నష్టాల్లోకి వెళ్ళినప్పటికీ... మొత్తంమీద పలు కారణాల నేపధ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డును తాకుతూ వచ్చాయి.

Updated Date - 2021-09-03T00:00:11+05:30 IST