మార్కెట్లోకి ప్రెస్టీజ్‌ స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌

ABN , First Publish Date - 2021-06-10T08:59:53+05:30 IST

కిచెన్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌.. మార్కెట్లోకి స్వచ్ఛ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌ను విడుదల

మార్కెట్లోకి ప్రెస్టీజ్‌ స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌

కిచెన్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌.. మార్కెట్లోకి స్వచ్ఛ్‌ గ్లాస్‌ టాప్‌ గ్యాస్‌ స్టవ్‌ను విడుదల చేసింది. అత్యంత సులభంగా శుభ్రం చేసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఈ గ్యాస్‌ స్టవ్‌లో వినూత్నమైన రీతిలో పైకి లేపగలిగిన బర్నర్‌ సెట్‌, డ్రిప్‌ ఫ్రీ డిజైన్‌తో తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ గ్యాస్‌ స్టవ్‌, 2,3,4 బర్నర్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది. ఐదేళ్ల వారంటీతో కూడిన స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌ ప్రారంభ ధర రూ.8,995. అయితే పరిచయ ఆఫర్‌లో భాగంగా రూ.7,200 ప్రారంభ ధరతో పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది.

Updated Date - 2021-06-10T08:59:53+05:30 IST