విద్యుత్తుకు... ముందుగానే డబ్బు కట్టాలి...

ABN , First Publish Date - 2021-08-21T00:32:54+05:30 IST

విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఇక స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి రానున్నాయి.

విద్యుత్తుకు... ముందుగానే డబ్బు కట్టాలి...

న్యూఢిల్లీ : విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఇక స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి రానున్నాయి. మరో నాలుగేళ్ళలో... అంటే 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రస్తుత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు వస్తాయి. ఈ క్రమంలో... విద్యుత్తు వినియోగదారులు ముందుగానే డబ్బులు కట్టాల్సి రావొచ్చనే అంచనాలున్నాయి. అంటే డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సి రావొచ్చు. అంటే... ప్రీపెయిద్ విద్యుత్తు అన్నమాట. 


ప్రస్తుతం మనం నెలంతా కరెంటు ఉపయోగించుకొని, బిల్లు వచ్చిన తర్వాత డబ్బు కడుతున్నాం. కానీ కొత్త స్మార్ట్ మీటర్లు వస్తే... విద్యుత్తు మీటరును ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంత మొత్తానికి రీచార్జ్ చేసుకుంటారో... ఆ మొత్తం వరకు కరెంటు వాడుకునే వీలుంటుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. నివేదికల ప్రకారం చూస్తే... రీచార్జ్ మొత్తం అయిపోయిన వెంటనే ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్తు వినియోగం సాధ్యపడుతుంది.


ఇకపోతే కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం ప్రకారం... 2023 డిసెంబరు, 2025 మార్చి నాటికి... రెండు విడతల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. రైతులు మినహా ఇతరత్రా అని వర్గాలకూ స్మార్ట్ మీటర్లు అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-21T00:32:54+05:30 IST