సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

ABN , First Publish Date - 2021-02-05T05:56:14+05:30 IST

మార్కెట్లో పోస్ట్‌ బడ్జెట్‌ ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు

సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

15,000 చేరువలో నిఫ్టీ  


మార్కెట్లో పోస్ట్‌ బడ్జెట్‌ ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో 358.54 పాయింట్లు బలపడి 50,614.29 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 105.70 పాయింట్ల లాభంతో 14,895.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 14,913.70 వద్ద సరికొత్త ఇంట్రాడే ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. మార్కెట్లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగితే, వారాంతం సెషన్‌లో నిఫ్టీ 15,000 మైలురాయిని చేరుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 


గడిచిన 4సెషన్ల లాభం

సెన్సెక్స్‌ 4,328.52 పాయింట్లు (9.35%)   

నిఫ్టీ  1,261.05

పాయింట్లు (9.20%)   

Updated Date - 2021-02-05T05:56:14+05:30 IST