‘పాపులర్ వెహికిల్స్’ ఐపీఓ... త్వరలో

ABN , First Publish Date - 2021-08-06T19:58:53+05:30 IST

త్వరలో ఐపీఓకు రానున్న పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్... డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేసింది.

‘పాపులర్ వెహికిల్స్’ ఐపీఓ... త్వరలో

చెన్నై / కొచ్చి : త్వరలో ఐపీఓకు రానున్న పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్... డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేసింది. ఐపీఓకు సంబంధించి రూ. 150 కోట్ల ఫ్రెష్ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద బన్యన్‌ట్రీ గ్రోత్ క్యాపిటల్ II, ఎల్‌ఎల్‌సీ ద్వారా 4.27 మిలియన్ షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం బన్యన్‌ట్రీ గ్రోత్ కేపిటల్ సంస్థలో పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌కు 34 శాతం వాటా ఉంది.


ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ కేపిటల్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్, సెంట్రమ్ కేపిటల్‌లు వ్యవహరించనున్నాయి. ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీ... రుణాలను తీర్చేందుకు వినియోగించనుంది. జూన్ 2021 నాటికి దాని ఫండ్-ఆధారిత, నాన్-ఫండ్-ఆధారిత వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్ సౌకర్యాల కింద ఉన్న బకాయి మొత్తం ఏకీకృత ప్రాతిపదికన రూ. 353.84 కోట్లు. ఇక... 2021 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ. 2,893.53 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది రూ. 3,171.62 కోట్లు వచ్చింది. నికరాదాయం ఈ సమయంలో రూ. 3,2.45 కోట్లకు చేరింది. 

Updated Date - 2021-08-06T19:58:53+05:30 IST