నష్టాల్లో పీఎన్బీ షేర్లు...
ABN , First Publish Date - 2021-10-29T04:35:17+05:30 IST
ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ‘బ్లాక్డీల్’ చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ : ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ‘బ్లాక్డీల్’ చోటుచేసుకుంది. రెండు బ్లాక్ డీల్స్ జరగడంతో 2.33 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. అయితే క్రయదారులు, విక్రయదారులకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. బ్లాక్ డీల్ నేపధ్యంలో... ఈ రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కరెక్షన్కు లోనవుతోంది.
ఇంట్రాడేలో లోయర్సర్క్యూట్ రూ. 41.70కు పడిపోయిన ఈ స్టాక్, ప్రస్తుతం 9.50 శాతం నష్టంతో రూ. 41.95 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు(గురువారం) ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో దాదాపు 10.10 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 46,191 కోట్లకు చేరింది. ఇక... సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో పీఎన్బీ నికరలాభంలో 78 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికరలాభం రూ. 621 కోట్ల నుంచి రూ. 1,105 కోట్లకు పెరిగింది.