ఏసీ, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్‌ పరికరాల తయారీకి ‘పీఎల్‌ఐ’

ABN , First Publish Date - 2021-04-08T06:07:15+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మరో 3 పరిశ్రమలను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం పరిధిలోకి తెచ్చింది. ఎయిర్‌ కండీషనర్లు(ఏసీ), ఎల్‌ఈడీ బల్బులతోపాటు సోలార్‌ పరికరాల తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది

ఏసీ, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్‌ పరికరాల తయారీకి ‘పీఎల్‌ఐ’

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో 3 పరిశ్రమలను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం పరిధిలోకి తెచ్చింది. ఎయిర్‌ కండీషనర్లు(ఏసీ), ఎల్‌ఈడీ బల్బులతోపాటు సోలార్‌ పరికరాల తయారీదారులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాలిచ్చేందుకు ఏసీలు, ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమలకు రూ.6,238 కోట్లు, సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌(పీవీ) మాడ్యూళ్ల తయారీ కంపెనీలకు రూ.4,500 కోట్లు కేటాయించింది. 

Updated Date - 2021-04-08T06:07:15+05:30 IST