మౌలిక ప్రాజెక్టుల్లోకి పీఎఫ్‌ సొమ్ము!

ABN , First Publish Date - 2021-11-21T05:38:07+05:30 IST

ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) చందాదారుల సొమ్మును ఇకపై మౌలిక రంగ ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడిగా పెట్టనున్నారు. వార్షిక పీఎఫ్‌ డిపాజిట్లలో 5 శాతాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) సహా ఇతర ప్రత్యామ్నాయ....

మౌలిక ప్రాజెక్టుల్లోకి పీఎఫ్‌ సొమ్ము!

వార్షిక డిపాజిట్లలో 5 శాతం ఇన్విట్‌, ఆల్టర్నేటివ్‌ ఫండ్స్‌లోకి..!!

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ఆమోదం 


న్యూఢిల్లీ: ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) చందాదారుల సొమ్మును ఇకపై మౌలిక రంగ ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడిగా పెట్టనున్నారు. వార్షిక పీఎఫ్‌ డిపాజిట్లలో 5 శాతాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) సహా ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లు (ఏఐఎ్‌ఫ)లో పెట్టుబడి పెట్టేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్‌ఫఓ) ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈపీఎ్‌ఫఓ ధర్మకర్తల కేంద్ర మండలి (సీబీటీ) 229వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘పీఎఫ్‌ ఖాతాదారుల సొమ్ముతో ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్లలో పెట్టుబడికి సీబీటీ ఆమోదం తెలిపింది.


ప్రభుత్వ రంగ ఇన్విట్‌ వంటి కేటగిరీ 1కు చెందిన ప్రభుత్వ ఫండ్లు, ప్రభుత్వ రంగ బాండ్లలో పెట్టుబడిపైనే దృష్టిసారించనున్న’’ట్లు ఉద్యోగ, కార్మిక శాఖ కార్యదర్శి సునీల్‌ బర్తవాల్‌ తెలిపారు. ఈ ఫండ్లలో పెట్టుబడికి సంబంధించిన అధికారాన్ని ఈపీఎ్‌ఫఓకు చెందిన ఫైనాన్స్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ (ఎఫ్‌ఐఏసీ)కి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. పీఎఫ్‌ చందాదారుల ఖాతాల్లోకి ఏటా జమయ్యే సొమ్ము రూ.1.9-2 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. 


అంటే, ఈపీఎఫ్‌ఓకు ఏటా రూ.10,000 కోట్ల వరకు ఆల్టర్నేటివ్‌ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టేందుకు వీలుంటుంది. ఇక ఇన్విట్స్‌ విషయానికొస్తే.. ఇవి కూడా మ్యూచువల్‌ ఫండ్ల వంటివే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల డెవలపర్లు తమ ప్రాజెక్టుల ఆస్తులన్నింటినీ ఒక గొడుగు కిందికి చేర్చి (ట్రస్ట్‌ రూపంలో ఏర్పాటు చేసి) విక్రయించేందుకు ఇన్విట్స్‌ వీలు కల్పిస్తాయి. ఇన్విట్స్‌తోపాటు ఎస్‌ఎంఈ ఫండ్లు, సోషల్‌ వెంచర్‌ ఫండ్లు కూడా ఏఐఎ్‌ఫలే. ఇవన్నీ సెబీ నియంత్రణ పరిధిలోకి వస్తాయి. 


కొత్తగా 4 సబ్‌-కమిటీల ఏర్పాటు:ఈపీఎ్‌ఫఓలో కొత్తగా 4 సబ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని సీబీటీ నిర్ణయించింది. ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌), క్యాడర్‌ ప్రమోషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాల ఆధునీకరణ, సామాజిక భద్రత ఏర్పాట్లకు సంబంధించి ఈ సబ్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కార్మిక మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-11-21T05:38:07+05:30 IST