ఇరవయ్యేళ్ళలో... కనిష్టానికి పెట్రోల్ వినియోగం...
ABN , First Publish Date - 2021-01-12T23:09:09+05:30 IST
దేశం మొత్తంమీద గతేడాది పెట్రోల్ మొత్తం వినియోగం రెండు దశాబ్దాల్లో మొదటి సారిగా క్షీణించింది. కరోనా, ఆర్థిక మాంద్యం తదితర పరిస్థితుల నేపధ్యంలో... ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల్లో ఒకటైన భారత్‌లో పెట్రోల్ వినియోగం భారీగా తగ్గింది.

న్యూఢిల్లీ : దేశం మొత్తంమీద గతేడాది పెట్రోల్ మొత్తం వినియోగం రెండు దశాబ్దాల్లో మొదటి సారిగా క్షీణించింది. కరోనా, ఆర్థిక మాంద్యం తదితర పరిస్థితుల నేపధ్యంలో... ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల్లో ఒకటైన భారత్‌లో పెట్రోల్ వినియోగం భారీగా తగ్గింది. వార్షిక పెట్రోల్ వినియోగం 21 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ వెల్లడించిన తాత్కాలిక గణాంకాల( బ్లూమ్‌బర్గ్ లెక్కల) ప్రకారం.. డీజిల్, గ్యాస్, జెట్ ఇంధనంతో సహా పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 2019 తో పోలిస్తే 10.8 శాతం క్షీణించింది. ఆ సమాచారం ప్రకారం... 1999 అనంతరం అత్యంత తక్కువ వినియోగం కిందటేడాదే(2020 లో) నమోదైందని వెల్లడించింది. వినియోగం కూడా ఐదేళ్ల కనిష్టానికి... అంటే 193.4 మిలియన్ టన్నులకు పడిపోయిందని తెలిపింది.