పేటిఎం అంచనా ఎక్కడ తప్పిందో ?

ABN , First Publish Date - 2021-11-09T07:30:50+05:30 IST

ఈ వారం ప్రారంభమైన ఐపిఓలలో క్రేజీ ఐపిఓగా పేరు తెచ్చుకున్నప్పటికీ... పేటిఎం ఐపిఓ ఓపెనింగ్ రోజు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయాలు విశ్లేషకులనుంచి వ్యక్తమవుతున్నాయి.

పేటిఎం అంచనా ఎక్కడ తప్పిందో ?

నోయిడా : ఈ వారం ప్రారంభమైన ఐపిఓలలో క్రేజీ ఐపిఓగా పేరు తెచ్చుకున్నప్పటికీ... పేటిఎం ఐపిఓ ఓపెనింగ్ రోజు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయిందన్న అభిప్రాయాలు విశ్లేషకులనుంచి వ్యక్తమవుతున్నాయి. చివరి రోజున కానీ, మొత్తంగాకానీ తర్వాత ఎన్ని రికార్డులైనా క్రియేట్ చేయనివ్వండి, మొదటి రోజు మాత్రం బాగా నిరాశ పరచిందనే చెబుతున్నారు. మొత్తంగా 4,83,89,422 షేర్ల కోసం బిడ్లను ఆహ్వానించగా, కేవలం 88,23,924 షేర్ల కోసం మాత్రమే మొదటి రోజున వన్97 కమ్యూనికేషన్స్ మెగాఐపిఓకు  బిడ్లు వచ్చాయి. అంటే కేవలం 18 శాతం మాత్రమే.


ఇక రిటైల్ ఇన్వెస్టర్ల కోటా మాత్రం 78శాతం ఫుల్ కాగా, నాన్ ఇన్సిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగరీకి కేవలం రెండు శాతం మాత్రమే సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయి. ఇక క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయ్యర్ల పోర్షన్ కూడా 6 శాతం మాత్రమే ఫిల్ అయింది పేటిఎం ఐపీఓ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ. 2,080-2,150 మధ్యలో రేటు ఫిక్స్ చేయడం కూడా రిటైల్ ఇన్వెస్టర్లు ఈ షేర్ల జోలికి పోకపోవడానికి అతి పెద్ద కారణమన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. లాట్ సైజ్ 6 షేర్లకు పరిమితం చేసినప్పటికీ...ఈ భారీ రేటుతో ఇంకెంత ప్రీమియం వస్తుందన్న ఆలోచనే  రిటైల్ ఇన్వెస్టర్ల నిరాదరణకి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ ఇష్యూ లాంగ్ టర్మ్ కోసం అయితే ఫరవాలేదు కానీ, వెంటనే మాత్రం లాభాలు రావని, కనీసం లిస్టింగ్ గెయిన్స్ వచ్చినప్పటికీ2... పెద్దగా ప్రయోజనముండదని, రిస్క్ రివార్డ్ రేషియోలో రిస్కే ఎక్కువని పనలువురు భావిస్తున్నారు పైగా ఫేస్ వేల్యూ కూడా రూ.1 పెట్టారు. ఇది పెద్దగా ప్రాముఖ్యత సంతరించుకోని అంశమైనప్పటికీ... స్టాక్ స్ప్లిట్ విషయంలో ఇదే చూస్తారు. ఇక ఇస్తే బోనస్ ఇవ్వాల్సిందే కానీ, ఈ షేర్లు స్ప్లిట్ కావడానికి అవకాశముండదన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. రూ. 18300కోట్ల అతి పెద్ద ఇష్యూగా రికార్డ్ క్రియేట్ చేస్తోన్న పేటీఎంకు ఇలా మొదటిరోజు మాత్రం తన అంచనాలు బెడిసికొట్టడం ఊహించి ఉండదని చెబుతున్నారు. అయితే తర్వాత పుంజుకున్నప్పటికీ...పై కారణాలతో ఇష్యూపై క్రేజ్ తగ్గిపోగా, నవంబరు 10 లోపున కనుక నైకా వంటి ఐపీఓలు మంచి లిస్టింగ్ గెయిన్స్ తెచ్చుకుంటే... ఆ ప్రభావం దీనిపై పడి... భారీగా సబ్‌స్క్రైబ్ అయ్యే అవకాశముంది. 

Updated Date - 2021-11-09T07:30:50+05:30 IST