పేటీఎం పేమెంట్స్ బ్యాంకు... ఇక షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు...

ABN , First Publish Date - 2021-12-10T02:10:36+05:30 IST

paూలో

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు... ఇక షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు...

ముంబై : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు... ఇక... షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంక్. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)... ఈ మేరకు స్టేటస్‌ను ఇచ్చింది. ఆర్‌బీఐ యాక్ట్ 1934 కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో... కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పొందడంతో, ప్రస్తుతం ఈ డిజిటల్ పేమెంట్ కంపెనీ ఇక కొత్త వ్యాపారాలపై దృష్టి సారించవచ్చని వినవస్తోంది. కాగా... ఈ వార్తతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. పేటీఎం పొందిన ఈ స్టేటస్ నేపధ్యంలో... కంపెనీ విస్తరణ జరిగి, ఇన్వెస్టర్లకు మంచి లాభాలను చేకూర్చనుందని భావిస్తున్నారు. 


ఇక... ప్రభుత్వం, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు జారీ చేసే ‘రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్స్(ఆర్‌ఓపీ), ప్రైమరీ ఆక్షన్‌‌లలో కూడా పేటీఎం షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు  పాల్గొనవచ్చు. సెప్టెంబరులోనే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంకు... అక్టోబరులో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే తమకు షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ వచ్చినట్టు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు గురువారం(ఈ రోజు) వెల్లడించింది. షెడ్యూల్ బ్యాంకు స్టేటస్ పొందిన నేపధ్యంలో... ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలను షెడ్యూల్ బ్యాంకులు అనుసరిస్తాయి. బ్యాంకు రేటు ప్రకారం ఆర్‌బీఐ నుంచి ఈ బ్యాంకులు రుణం పొందవచ్చు. రిజర్వు బ్యాంకు నుంచి ఫస్ట్ క్లాస్ డిస్కౌంట్లను పొందవచ్చు. రోజువారీ బ్యాంకింగ్ అవసరాల కోసం ఆర్‌బీఐ నుంచి నగదును అప్పు తీసుకునే సౌకర్యం షెడ్యూల్ బ్యాంకులకు ఉంటుంది.


Updated Date - 2021-12-10T02:10:36+05:30 IST