ఇదో గొప్ప ఈవెంట్‌గా ఉంటుంది...

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

పేటీఎం ఐపీఓపై సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్ స్పందించారు. పేటీఎం ఐపీఓ సోమవారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇదో గొప్ప ఈవెంట్‌గా ఉంటుంది...

ముంబై : పేటీఎం ఐపీఓపై సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మసయోషి సన్ స్పందించారు. పేటీఎం ఐపీఓ సోమవారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైన విషయం తెలిసిందే. జపనీస్ పెట్టుబడి దిగ్గజానికి ఇదొక గ్రేట్ ఈవెంట్‌గా ఆయన అభివర్ణించారు. నేడు(నవంబరు 10, బుధవారం) ముగియనున్న పేటీఎం ఐపీఓలో రూ. 10 వేల కోట్ల ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా సాఫ్ట్‌బ్యాంక్ రూ. 1,689 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తోంది.


సోమవారం సాఫ్ట్‌బ్యాంకు ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అనంతరం సన్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘పేటీఎం సిగ్నిఫికెంట్‌గా, వాల్యుయేషన్ పరంగా అద్భుతంగా వృద్ధి చెందుతుంది. అయితే ఇది మార్కెట్ కండీషన్స్, ఇన్వెస్టర్స్‌పై ఆధారపడి ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టినప్పుడు(కంపెనీలో) వెచ్చించిన ఖర్చు కంటే(ఐపీఓ సమయంలో పేటీఎం) వాల్యుయేషన్ పెద్దదిగా ఉండాలి. కాబట్టి మాకు ఈ ఐపీఓ ఓ గొప్ప ఈవెంట్‌గా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌బ్యాంక్ మొదటిసారిగా 2017 లో పేటీఎం పేరెంట్ వన్97 కమ్యూనికేషన్స్‌లో పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత పేమెంట్స్ సంస్థ విలువ 7-8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST