ఎన్‌సీఎల్‌కు రూ.1,863 కోట్ల ఆర్డర్‌

ABN , First Publish Date - 2021-08-03T05:49:32+05:30 IST

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ కన్సార్షియానికి రూ.1,863 కోట్ల ఆర్డర్‌

ఎన్‌సీఎల్‌కు రూ.1,863 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ కన్సార్షియానికి రూ.1,863 కోట్ల ఆర్డర్‌ లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు స్టీల్‌ విండో ఫ్రేమ్‌లు, షట్టర్లు, డోర్‌ ఫ్రేమ్‌లను సరఫరా చేయడానికి బిడ్‌ను ఆమోదించినట్లు లెటర్స్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ లభించిందని ఎన్‌సీఎల్‌ తెలిపింది. అన్నీ పరిశీలించిన తర్వాత కాంట్రాక్టు అగ్రిమెంట్‌ కుదురుతుందని పేర్కొంది. కన్సార్షియం లీడర్‌గా ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ వ్యవహరిస్తుంది. కన్సార్షియంలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీ్‌సకు 50 శాతం వాటా ఉంటుంది. 


ఎన్‌సీసీకి రూ.1,679 కోట్ల పనులు : గత నెలలో ఎన్‌సీసీకి రూ.1,679 కోట్ల విలువైన నాలుగు కొత్త ఆర్డర్లు లభించాయి. బిల్డింగ్‌, వాటర్‌, పర్యావరణం, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఈ ఆర్డర్లు లభించినట్లు కంపెనీ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల నుంచి ఈ పనులు పొందినట్లు తెలిపింది. 

Updated Date - 2021-08-03T05:49:32+05:30 IST