కొత్త ఫీచర్లతో 9 సిరీస్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-08-21T00:32:54+05:30 IST

కొత్త ఫీచర్లతో 9 సిరీస్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

కొత్త ఫీచర్లతో 9 సిరీస్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో భారత మార్కెట్‌లో వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. అక్టోబర్ నెలలో భారత్, చైనా మార్కెట్లలో వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండే అవకాశం ఉంది.. 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 870, 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.

Updated Date - 2021-08-21T00:32:54+05:30 IST