వన్ నేషన్-వన్ గ్రిడ్-వన్ ఫ్రీక్వెన్సీ ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-12-31T09:11:37+05:30 IST
వన్ నేషన్-వన్ గ్రిడ్-వన్ ఫ్రీక్వెన్సీ లక్ష్యాలను సాధించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వెల్లడించింది.

హైదరాబాద్: వన్ నేషన్-వన్ గ్రిడ్-వన్ ఫ్రీక్వెన్సీ లక్ష్యాలను సాధించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 70కి పైగా సబ్‌స్టేషన్లలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఏడు సబ్‌స్టేషన్లు ఉన్నాయని పేర్కొంది. వన్ నేషన్-వన్ గ్రిడ్-వన్ ఫ్రీక్వెన్సీ లక్ష్యాలను అందుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లోని రీజినల్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఏపీ, తెలంగాణల్లోని ఏడు సబ్‌స్టేషన్లను త్రివర్ణ రంగులతో కూడిన దీపాలతో వెలుగులు విరజిమ్మేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా సబ్‌స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా హెల్త్ చెక్‌ప్సతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.