ఓ నిరీక్షణకు తెరపడింది: ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2021-02-01T21:57:25+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా

ఓ నిరీక్షణకు తెరపడింది: ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అనుకోని ఆర్థిక ఒత్తిడి నెలకొన్న వేళ అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తగినంత ఖర్చు చేయడమో, లేదంటే ప్రజల కష్టాలను ఎదుర్కోవడమో చేయాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉందన్నారు. ఈ బడ్జెట్ విషయంలో ఓ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు. లక్ష్యంగా ఉన్న ఆర్థిక లోటు పరంగా మనం చాలా ఉదారంగా ఉండాలని,  బాక్స్ టిక్ చేయబడిందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బడ్జెట్ అంచనా  మూలధన వ్యయాన్ని రూ. 5.54 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనా (రూ. 4.12 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది 34.5 శాతం ఎక్కువ కావడం గమనార్హం. వనరుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ మూలధనం కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని,  2020-21లో  మూలధన వ్యయం దాదాపు రూ. 4.39 లక్షల కోట్ల వరకు ఉంటుందని సీతారామన్ వివరించారు. 

Updated Date - 2021-02-01T21:57:25+05:30 IST