నెదర్లాండ్స్ రాయబార కార్యాలయానికి... ‘ఓలా’

ABN , First Publish Date - 2021-11-19T10:12:51+05:30 IST

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’కు బంపర్ ఆఫర్ దక్కింది. నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రత్యేక ఆర్డర్ అందుకుంది.

నెదర్లాండ్స్ రాయబార కార్యాలయానికి...  ‘ఓలా’

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’కు  బంపర్ ఆఫర్ దక్కింది. నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రత్యేక ఆర్డర్ అందుకుంది. నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం అధికారుల కోసం 9 కస్టమైజ్డ్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. వీటిలో భారతదేశంలోని నెదర్లాండ్స్ మూడు దౌత్య కార్యాలయాల్లో  వినియోగించనున్నారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


నెదర్లాండ్స్ అధికారిక రంగు అయిన కస్టమ్ ఆరెంజ్ రంగులో ఈ స్కూటర్లను తయారు చేస్తున్నారు. ఈ రంగుకు ఓలా ‘డచ్ ఒరాంజే’ అనే పేరు పెట్టింది. ఇక ఈ స్కూటర్‌పై నెదర్లాండ్స్ అధికారిక లోగోను కూడా ముద్రించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారు చేసిన అధునాతన ఓలా ఎస్1 ప్రో స్కూటర్లను రాబోయే వారాల్లో న్యూఢిల్లీలోని నెదర్లాండ్స్ ఎంబసీకి, ఓలా కస్టమర్ డెలివరీలను ప్రారంభించిన తర్వాత ముంబై, బెంగళూరుల్లోని  కాన్సులేట్ జనరల్ కార్యాలయాలకు డెలివరీ చేయనున్నారు. కాగా.. ఈ స్కూటర్లను ఓలా వచ్చే ఏడాది యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఈస్ట్ ఆసియా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  మొబిలిటీ సంస్థ తన కస్టమర్లకు టెస్ట్ రైడ్‌లను డెలివరీ చేయడం ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాదు.. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అందుకుంది కూడా. 

Updated Date - 2021-11-19T10:12:51+05:30 IST